Breaking News: వైద్య పరీక్షలు... క్షిణించిన బండి సంజయ్ ఆరోగ్యం...!
By: Anji Wed, 28 Oct 2020 06:00 AM
తన కార్యాలయంలోనే నిర్బంధ నిరాహారదీక్షకు దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సోమవారం దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సిద్దిపేటలో జరిగిన పరిణామాలను నిరసిస్తూ ఆయన దీక్షకు పూనుకున్నాడు.
సంజయ్ ఆరోగ్యం స్వల్ఫంగా క్షిణించిందని, ఆయన శరీరంలోని షుగర్ లెవల్స్ పడిపోతుండటంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, బీజేపీ అధిష్ఠానం సంజయ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తోంది.
ఆయన్ను పరామర్శించేందుకు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు కరీంనగర్ చేరుకుంటున్నారు. బండి సంజయ్ ఆరోగ్యం క్షిణిస్తుండటంతో ఆయన కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఆయన షుగర్ లెవెల్స్ తగ్గిపోవడటంతో ప్రభుత్వ వైద్యులు ప్లూయిడ్స్ ఎక్కించారు. అనంతరం సంజయ్‌ను మెరుగైన వైద్యం కోసం అపోలో రీచ్ ఆస్పత్రికి తరలించారు.నిన్న పోలీసులు జరిపిన దాడుల్లో సిద్ధిపేటలోని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువు ఇంట్లో లక్షల రూపాయల నగదు బయటపడింది.
ఈ నేపథ్యంలో దుబ్బాక వెళ్తున్న తనపై సిద్దిపేట పోలీసు కమిషనర్ దౌర్జన్యం చేసి చేయి చేసుకున్నారని, ఆయన్ని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ సంజయ్ దీక్ష చేపట్టారు. సీపీని బదిలీ చేసి ఆయనపై కేసు నమోదు చేసేవరకు తన కార్యాలయంలోనే ఉంటానని ప్రకటించి దీక్షకు దిగారు. బయటి నుంచి తాళం వేసుకుని నిన్న రాత్రి నుంచి కార్యాలయంలో నేలపైనే దీక్ష కొనసాగిస్తున్నారు.