ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..సీఎం కెసిఆర్
By: Sankar Wed, 30 Dec 2020 1:34 PM
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచేందుకు నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతామని టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.
దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలనే విషయంలో అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చిస్తుందని అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అంశం చిక్కుముడిగానే ఉండేది. ఏది ముట్టుకున్నా పంచాయితీ, కోర్టు కేసులే ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అవి కొనసాగాయి. ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపి, న్యాయ వివాదాలను పరిష్కరించుకొని ఇప్పుడిప్పుడే అన్ని విషయాల్లో స్పష్టతకు వస్తుంది అని సీఎం కెసిఆర్ అన్నారు