Advertisement

  • గూగుల్ పిక్సెల్ 5 స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 30న లాంచ్ చేయనున్న గూగుల్

గూగుల్ పిక్సెల్ 5 స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 30న లాంచ్ చేయనున్న గూగుల్

By: chandrasekar Thu, 24 Sept 2020 12:56 PM

గూగుల్ పిక్సెల్ 5 స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 30న లాంచ్ చేయనున్న గూగుల్


టెక్ దిగ్గజం గూగుల్ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 5గా పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 30న గూగుల్ ఆన్‌లైన్ ఈవెంట్‌లో క్రోమ్‌కాస్ట్, నెస్ట్ ఆడియో పరికరాలతో పాటు లాంచ్ కానుంది. కాగా గూగుల్ ఈవెంట్‌కు ముందే పిక్సెల్ 5కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీకయ్యాయి. విన్‌ఫ్యూచర్ లీక్ చేసిన వివరాల ప్రకారం గూగుల్ నుంచి వచ్చే ఈ ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం మిడ్-రేంజ్ ఆఫర్‌గా నిలుస్తుందని సమాచారం.

ఈ స్మార్ట్‌ఫోన్ 6 అంగుళాల 90 హెర్ట్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని మరియు 19.5: 9 ఆస్పెక్ట్ రేషియోతో 432 పిపిఐని కలిగి ఉంటుందని వెల్లడించింది. దీని స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 6 లేయర్తో కూడా వస్తుంది.

పిక్సెల్ 4ఎ మాదిరిగానే గూగుల్ పిక్సెల్ 5లో కూడా సన్నని బెజల్స్ , హోల్ ఎడమ మూలలో పంచ్ కటౌట్ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 100 శాతం రీసైకిల్ చేసిన అల్యూమినియంతో తయారు చేయబడి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో IP68 సర్టిఫికేషన్తో వస్తుంది.

గూగుల్ పిక్సెల్5 లో 5జి కనెక్టివిటీ కోసం హుడ్ కింది భాగాన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్ ఉంటుంది. వీటితో పాటు 8 జిబి ర్యామ్, 128 జిబి మెమరీ ఉంటుంది.

దీనితో పాటు పిక్సెల్ 5 రివర్స్-పవర్ సామర్థ్యంతో వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసేలా నూతన 4,080 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా మర్కెట్లోకి విడుదల చేయనుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే, గూగుల్ పిక్సెల్ 5 వెనుకవైపు 12.2MP మెయిన్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాక 16MP వైడ్ యాంగిల్ కెమెరా f/2.2తో 107-డిగ్రీల FOV కలిగి ఉంటుంది.

ఈ కెమెరా 4K సెటప్తో 60FPS మరియు 1080p 240FPS వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో పిక్సెల్ 5 పనిచేసే అవకాశం ఉంది.

గూగుల్ పిక్సెల్ 5 లాంచ్ ఈవెంట్‌లో దీని ధరతో పాటు మిగతా వివరాలు ఆవిష్కరించబడతాయి. అయితే ప్రస్తుతం పిక్సెల్ 5ని భారతదేశంలో అందుబాటులోకి తేవట్లేదని గూగుల్ పేర్కొంది.

Tags :
|

Advertisement