Advertisement

  • క్రోమ్ బ్రౌజర్ కు మరిన్ని ఫీచర్లను యాడ్ చేసిన గూగుల్

క్రోమ్ బ్రౌజర్ కు మరిన్ని ఫీచర్లను యాడ్ చేసిన గూగుల్

By: chandrasekar Thu, 27 Aug 2020 11:33 AM

క్రోమ్ బ్రౌజర్ కు మరిన్ని ఫీచర్లను  యాడ్ చేసిన గూగుల్


క్రోమ్‌ బ్రౌజర్‌కు మరిన్ని ఫీచర్లను టెక్‌ దిగ్గజం గూగుల్‌ యాడ్‌ చేసింది. వేగంగా లోడ్‌ చేసే ట్యాబ్‌లతో సహా పలు ఫీచర్లను గూగుల్‌ ప్రవేశపెట్టింది.

ఆన్‌లైన్‌లో ఇంటి నుంచి పనిచేస్తున్న, ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నప్పుడు వీటికి సంబంధించిన అంశాలను క్రోమ్‌ బ్రౌజర్‌లో సులభంగా నిర్వహించుకోవడానికి కొత్త ఫీచర్‌ వాడకందార్లకు ఉపయోగపడనుంది.

కొత్త ఫీచర్‌తో ట్యాబ్‌లు 10శాతం వేగంగా లోడ్‌ అవుతాయి. యూజర్లు ఇప్పుడు ట్యాబ్‌ గ్రూప్‌లను ఎక్స్‌పాండ్‌ చేసుకోవచ్చు లేదా డిలీట్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌ బార్‌లో టైటిల్‌ను టైప్‌ చేయడం ప్రారంభించగానే మీరు ఇప్పటికే ఓపెన్‌ చేసి ఉంటే ఆ ట్యాబ్‌కు మారండి అని సూచిస్తుంది. ల్యాప్‌టాప్‌లోని క్రోమ్‌లో ఫీచర్‌ను యూజర్లు వాడుకోవచ్చు.

Tags :
|

Advertisement