ఇక నుంచి ఆ దిగ్గజ సంస్థ ఉద్యోగులకు వారానికి మూడు రోజులు సెలవులు
By: Sankar Mon, 07 Sept 2020 11:45 AM
టెక్ దిగ్గజ కంపెనీల్లో ఒక్కటైన గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు వారంలో మూడు రోజులను సెలవులుగా ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఇప్పటి వరకు శని, ఆదివారాలను మాత్రమే వారాంతపు సెలవులుగా తీసుకున్న గూగుల్ ఉద్యోగులకు.. తాజా ప్రకటనతో శుక్రవారం కూడా సెలవు తీసుకునే అవకాశం లభించింది. గూగుల్ ఉద్యోగులు దాదాపు ఆరు నెలల నుంచి 'వర్క్ ఫ్రమ్ హోం' విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
అయితే.. 'వర్క్ ఫ్రమ్ హోం' వల్ల పని గంటలు పెరిగాయని, వ్యక్తిగత సమయాన్ని కూడా విధుల కోసం కేటాయించాల్సి వస్తోందని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో వారంలో మూడు రోజులు.. అంటే.. శుక్ర, శని, ఆదివారాలు సెలువు పొందనున్నారు గూగుల్ ఉద్యోగులు.