సోషల్ నెట్‌వర్క్ గూగుల్ ప్లస్ సేవల్ని మూసేస్తున్నట్లు గూగుల్ ప్రకటన
By: chandrasekar Wed, 08 July 2020 4:45 PM
ఫేస్‌బుక్‌కి పోటీగా 2011లో గూగుల్ సంస్థ పరిచయం చేసిన గూగుల్ ప్లస్ కథ
దశాబ్దం తర్వాత ముగిసింది. గూగుల్ ప్లస్
ఐఓఎస్, ఆండ్రాయిడ్
యాప్స్ ఇకపై గూగుల్ కరెంట్స్ గా కొనసాగుతాయి.
గూగుల్ ప్లస్‌ను
మూసివేస్తారని ఏడాదిగా సాగిన ఊహాగానాలకు
ఇప్పుడు తెరపడింది. గూగుల్ తన సోషల్ నెట్‌వర్క్ గూగుల్ ప్లస్ సేవల్ని
మూసేస్తున్నట్లు ఏప్రిల్ 2019లో
ప్రకటించించినప్పటికీ దీన్ని ఓ కొత్త బిజినెస్ టూల్‌గా మార్చనున్నట్లు తెలిపింది.
వర్క్‌ప్లేస్ సోషల్
నెట్‌వర్క్ 'ఫేస్‌బుక్
వర్క్‌ప్లేస్' మాదిరిగా పనిచేయనుంది. ఇప్పుడున్న సేవలన్నీ కొనసాగుతాయి
కానీ, ఎంటర్‌ప్రైజ్ కస్టమర్ల కోసం ప్రస్తుతమున్న గూగుల్
ప్లస్ లింకులన్నీ 'గూగుల్
కరెంట్స్' పేజీలకు రీడైరెక్ట్ అవుతాయి.
ఫేస్‌బుక్‌కు పోటీగా
ప్రారంభించినప్పటికీ యూజర్లను ఆకట్టుకోలేకపోయింది. 2018లో యూజర్ల డేటా బహిర్గతం కావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నది. అప్పటి నుంచి కొత్త
ప్రొఫైల్‌ని క్రియేట్ చేయకుండా నిషేధం
విధించారు.