YES BANK క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభావార్త...
By: chandrasekar Fri, 27 Nov 2020 11:31 AM
ఈ కొత్త ఫీచర్ వల్ల YES BANK వినియోగదారులు తమ సంతోషాన్ని నలుగురితో షేర్ చేయడంతో పాటు క్రెడిట్ కార్డు
రివార్డు పాయింట్స్ ను కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు. మీరు
క్రెడిట్ కార్డు వినియోగించేవారు అయితే మీకు క్రెడిట్ పాయింట్స్ ప్రాధాన్యత తెలిసే
ఉంటుంది. ఇక క్రెడిట్ కార్డు రివార్ట్ ప్రోగ్రామ్ మరింత లాభదాయకంగా మారనుంది.
ఎందుకంటే YES BANK కొత్తగా
ఒక ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ఫీచర్ వల్ల మీరు ఇక మీ రివార్డ్
పాయింట్స్ ను షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనే సంచలనం అని
చెప్పవచ్చు. ఈ కొత్త ఫీచర్ వల్ల యస్ బ్యాంకు
క్రెడిట్ కార్డు మెంబర్స్ రివార్డు పాయింట్స్ ను ఇతరులతో పంచుకోవచ్చు.
కొత్త ఫీచర్...
* ఔట్ స్టాండింగ్ స్టేట్మెంట్ పై క్రెడిట్ కార్డు
రివార్డ్స్ రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
* రివార్డ్ పాయింట్స్ ను, ఎస్ బ్యాంక్ క్రెడిట్
కార్డు బ్యాలెన్స్ పేమెంట్స్ తో కలిపి వినియోగించుకోవచ్చు. రివార్డు పాయింట్లు
ఎప్పుడూ ఎక్స్పైర్ అవ్వవు.
* ఫ్లైట్ టికెట్ బుకింగ్ సమయంలో మీరు యస్ బ్యాంక్
రివార్డ్స్ వాడితే జీరో కన్వీనియెన్స్ ఫీజు వర్తిస్తుంది.
* ట్రావెల్, డైనింగ్, గ్రాసరీలపై ప్రత్యేకమైన రివార్డులు అందుతాయి.
ఇటీవలే యస్ బ్యాంక్
లిమిటెడ్ జులై-సెప్టెంబర్ క్వార్టర్ లో రూ.129 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.