లోన్ తీసుకోవాలనుకునే వారికి శుభవార్త.....
By: chandrasekar Mon, 02 Nov 2020 7:13 PM
ప్రస్తుతం బ్యాంకులు
తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. అయితే అన్ని బ్యాంకుల్లో ఈ సదుపాయం ఉండదు.
బ్యాంక్ ప్రాతిపదికన వడ్డీ రేటు మారుతుంది. ఇప్పుడు తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్
అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఏంటివో తెలుసుకుందాం. యూనియన్ బ్యాంక్
తక్కువ వడ్డీకే రుణాన్ని అందిస్తోంది. ఈ బ్యాంకులో వడ్డీ రేటు 8.9 శాతం
నుంచి ప్రారంభమౌతోంది. అంటే మీరు రూ.5 లక్షల రుణం తీసుకుంటే మీకు నెలవారీ ఈఎంఐ రూ.10,355 నుంచి ప్రారంభమౌతోంది. ఇక్కడ ఐదేళ్ల కాల పరిమితికి ఈ ఈఎంఐ వర్తిస్తుంది.
ఇండియన్ బ్యాంక్‌లో వడ్డీ
రేటు 9.05
శాతంగా ఉంది. అంటే ఈఎంఐ రూ.10,391గా ఉంటుంది. యూకో బ్యాంక్‌లో వడ్డీ 10.05
శాతంగా ఉంది. నెలవారీ ఈఎంఐ రూ.10,636 అవుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్
బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి 8.95 శాతం వడ్డీకి రుణాలు అందిస్తున్నాయి. అంటే మీకు
నెలవారీ ఈఎంఐ రూ.10,367 అవుతుంది.
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI లో
వడ్డీ రేటు 9.6 శాతంగా ఉంది. ఇక్కడ ఈఎంఐ రూ.10,525గా పడుతుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర కూడా తక్కువ వడ్డీకే 9.7
శాతానికే రుణాన్ని అందిస్తోంది. ఈ బ్యాంక్ లోన్ తీసుకుంటే మీరు నెలకు రూ.10,550 చెల్లించాలి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోన్ తీసుకుంటే నెలకు రూ.10,685గా ఉంటుంది. ఇక్కడ వడ్డీ రేటు 10.25 శాతంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో వడ్డీ రేుట 10.75
శాతంగా ఉంది. అంటే ఈఎంఐ రూ.10,809 అవుతుంది. ఇక కోటక్ బ్యాంక్‌లో కూడా ఇదే వడ్డీ రేటు
ఉంది.