తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణాలు చేసేవారికి గుడ్ న్యూస్...
By: chandrasekar Fri, 09 Oct 2020 12:21 PM
ఇండియన్ రైల్వేస్ తాజాగా
రైళ్ల వేగం పెంచే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే రెండు తెలుగు
రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి సికింద్రాబాద్ మధ్య రాకపోకలు
సాగించే రైళ్ల వేగం పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అందుకోసం దక్షిణ మధ్య
రైల్వే పరిధిలోని స్వర్ణ చతుర్బుజి సెక్షన్‌లో రైల్వే ట్రాక్స్‌ని మరింత బలోపేతం
చేయడంతో పాటు అవసరమైన చోట మరమ్మతులు చేపడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం రైళ్లు పలు మార్గాల్లో
గరిష్టంగా గంటకు 110 కిమీ వేగంతో
ప్రయాణిస్తుండగా ఇంకొన్ని మార్గాల్లో గంటకు 120 కి.మీ వేగంతో
పరిగెడుతున్నాయి. ఈ గరిష్ట వేగాన్ని గంటకు 130 కిమీ వేగంతో పరిగెత్తేలా చేయడం కోసం ప్రస్తుతం
రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ప్రయత్నాలు పూర్తయిన
అనంతరం పలు ట్రయల్స్ వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నుంచి
గరిష్ట వేగం పెంచేందుకు అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది. అనంతరం అనుమతించిన
మార్గాలలో రైళ్లు వేగంగా పోనున్నాయి. అదే కానీ జరిగిందంటే ప్రస్తుతం రైలు
ప్రయాణాలకే ఎక్కువ సమయం వృధా అయిపోతుందేనని ఆందోళన చెందేవారికి ఆ తిప్పలు
కొంతమేరకు తగ్గనున్నాయి.