తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త...మళ్లీ ప్రారంభం కానున్న షిర్డీ రైలు...
By: chandrasekar Sat, 28 Nov 2020 6:21 PM
పశ్చిమగోదావరి జిల్లా
నరసాపురం నుంచి షిర్డీకి రైలు సర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ ఒకటి
నుంచి నరసాపురం నుంచి షిర్డీకి వెళ్లే నాగర్‌సోల్ రైలు పునఃప్రారంభంకానుంది. ఈ
మేరకు రైల్వే శాఖ అధికారులు ప్రకటన చేశారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది మార్చి 23 నుంచి
నాగర్ సోల్ రైలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
ఇటు ప్రత్యేకంగా
నడిపిస్తున్న రైళ్ల సేవలను మరికొంతకాలం పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య
రైల్వేప్రకటించింది. సికింద్రాబాద్-హావ్‌డా (02702/02705),
విజయవాడ-ఎంజీఆర్ చెన్నైసెంట్రల్ (02711/02712).. విజయవాడ-విశాఖపట్నం (02718/02717) సికింద్రాబాద్-షాలిమార్
(02774/02773) రైళ్లు ఉన్నాయి.
దసరా, దీపావళి
రద్దీ దృష్ట్యా నడుస్తున్న 14 ప్రత్యేక రైళ్లు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు
ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. డిసెంబరు నెలాఖరు వరకు పొడిగించింది.
ప్రత్యేక రైళ్ల సమయాలు డిసెంబరు 1 నుంచి మారుతున్నట్లు తెలిపింది. అయ్యప్ప భక్తుల కోసం
సికింద్రాబాద్-త్రివేండ్రం మధ్య రెండు రైళ్లను జనవరి 20 వరకు
నడపాలని నిర్ణయించింది.