తెలంగాణ ఇంటర్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు శుభవార్త
By: chandrasekar Wed, 04 Nov 2020 7:06 PM
ఇంటర్ పరీక్షలకు హాజరుకాని
విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ ఏడాది
మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు హాజరుకాని 27,589 మంది విద్యార్థులను
గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
వీరిలో మాల్ ప్రాక్టీస్ కమిటీ
బహిష్కరించిన 338 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. కరోనా నేపథ్యంలో
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చిలో జరిగిన ఇంటర్
పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ పరీక్షలు నిర్వహించకుండా
గ్రేస్ మార్కులతో పాస్ చేసిన విషయం తెలిసిందే.
Tags :
students |
appear |