సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన యాజమాన్యం
By: Sankar Tue, 13 Oct 2020 5:25 PM
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పారు సీఎండీ ఎన్ శ్రీధర్.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మినహాయించిన జీతాలతో పాటు.. సింగరేణి లాభాల్లో బోనస్‌ను కూడా ఇవ్వనున్నారు..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణిలో లాభాల బోనస్ 28 శాతం ఈ నెల 23వ తేదీన చెల్లిస్తున్నట్లు సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ ప్రకటించారు.. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన నికర లాభాలు 993.86 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం మేరకు దీనిలో 28 శాతం అనగా 278.28 కోట్ల రూపాయలను సంస్థలోని ఉద్యోగులకు ఈ నెల 23వ తేదీన పంపిణీ చేయనున్నారు..
సగటున ఒక్కో కార్మికుడికి రూ.60,468 లాభాల బోనస్ లభించే అవకాశం ఉంది.. ఇక, కరోనా నేపథ్యంలో మార్చి 2020 జీతాల్లో మినహాయించిన జీతాన్ని కూడా ఈ లాభాల బోనస్ తో పాటు కలిపి 23వ తేదీనే కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.. మరోవైపు... దసరా పండుగ అడ్వాన్సు సొమ్మును ఒక్కొక్కరికి 25 వేల రూపాయలను ఈ నెల 19వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు సీఎండీ శ్రీధర్.