డిగ్రీ పాసైనవారికి శుభవార్త....(SBI) ఎస్‌బీఐలో 8500 అప్రెంటీస్ పోస్టులు...
By: chandrasekar Mon, 23 Nov 2020 6:48 PM
దేశవ్యాప్తంగా స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా 8500
అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తెలంగాణలో 460, ఆంధ్రప్రదేశ్‌లో
620
పోస్టులు ఉన్నాయి. అప్రెంటీస్ గడువు మూడేళ్లు మాత్రమే ఉంటుంది. ఇవి కేవలం
అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు ఎంపికైనవారిని ఎస్‌బీఐ ఉద్యోగులుగా
గుర్తించరు. విద్యార్హతలు, ఇతర అర్హతల గురించి నోటిఫికేషన్‌లో వివరించింది
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI.
పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. ఇక ఈ
పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2020
డిసెంబర్ 10 వరకు అవకాశం ఉంది. మరి ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలో
తెలుసుకోండి. అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో
లేదో తెలుసుకోవాలి. https://bank.sbi/careers
వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ఉంటుంది. తగిన అర్హతలు ఉన్న
అభ్యర్థులు ఈ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయడానికి 5 వెబ్‌సైట్స్
ఉన్నాయి. వీటిలో ఏ వెబ్‌సైట్‌లో అయినా దరఖాస్తు చేయొచ్చు. ఆ వెబ్‌సైట్స్ ఇవే.
DRDO Recruitment
2020: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... వేతనం రూ.54,000
SBI PO Recruitment
2020: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 2000 ఉద్యోగాలు...
ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే
స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియా-SBI అధికారిక
వెబ్‌సైట్స్ https://bank.sbi/web/careers
లేదా https://www.sbi.co.in/web/careers
నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్
కార్పొరేషన్-NSDC వెబ్‌సైట్ https://nsdcindia.org/apprenticeship
నేషనల్ అప్రెంటీస్‌షిప్
ప్రమోషన్ స్కీమ్ వెబ్‌సైట్ https://apprenticeshipindia.org/
బీఎఫ్ఎస్ఐ సెక్టార్
స్కిల్ కౌన్సిల్ వెబ్‌సైట్ http://www.bfsissc.com/
ఈ ఐదు వెబ్‌సైట్లలో
అభ్యర్థులు 8500 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు
చేసేముందు పనిచేస్తున్న ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ సిద్ధం చేసుకోవాలి. వీటికే మీ దరఖాస్తు
వివరాలు వస్తాయి. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మీ పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర
వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. మీ లేటెస్ట్ ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
మీ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ గుర్తుంచుకోవాలి. దరఖాస్తు చేసిన తర్వాత
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
DRDO Scholarship: విద్యార్థులకు రూ.1,86,000 స్కాలర్‌షిప్...
దరఖాస్తుకు డిసెంబర్ 31 వరకు గడువు
DRDO: బీటెక్ పాసైనవారికి గుడ్ న్యూస్... రూ.31,000 వేతనంతో డీఆర్‌డీఓలో ఉద్యోగాలు
ఈ నోటిఫికేషన్‌కు
దరఖాస్తు చేయడంలో ఏవైనా సమస్యలు ఉన్నా, ఇతర సందేహాలు ఏవైనా ఉన్నా 022-22820427 నెంబర్‌కు వర్కింగ్ డేస్‌లో ఉదయం 11 గంటల
నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్ చేయాలి. లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS
క్యాండిడేట్ గ్రీవియెన్స్ రిడ్రస్సల్ సిస్టమ్ వెబ్‌సైట్
http://cgrs.ibps.in లో మీ సందేహాలను రిజిస్టర్ చేయొచ్చు. ఇమెయిల్
సబ్జెక్ట్‌లో ‘Engagement of
Apprentice in SBI’ అని రాయాలి.