Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

By: chandrasekar Thu, 05 Nov 2020 10:46 AM

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త


ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి DA పెంచి శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల డియర్ నెస్ అలయెన్స్ ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 2018 జులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు కూడా స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం డీఏ ఇప్పుడు 27.248 నుంచి 30.392కు పెరిగింది. 2021 జనవరి జీతాలతో కలిపి క్యాష్ రూపంలో చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఉద్యోగులకి 2018 జులై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు మొత్తం 30 నెలల బకాయిల్ని 3 సమభాగాల్లో పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. సీపీఎస్ వారికైతే 30 నెలల ఎరియర్స్ 90 శాతం నగదుతో పాటు 10 శాతం పాన్ అక్కౌంట్ కు జనవరి జీతాల చెల్లింపు అనంతరం అంటే 3 సమాన భాగాల్లో జమ చేస్తామని వివరించింది. పెంచిన డీఏను ఎప్పుడు చెల్లించేది, సీపీఎస్ వారికి ఎలా అందించేది సమగ్ర వివరాల్ని ఉత్తర్వుల్లోనే చెప్పడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పండగ వేళ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

Tags :
|
|

Advertisement