టమాటాలకని వెళ్లి హైదరాబాద్ లో అదృశ్యం అయిన పిల్లలు విశాఖలో ప్రత్యక్ష౦...
By: chandrasekar Wed, 16 Dec 2020 4:01 PM
హైదరాబాద్‌లో అదృశ్యం ఐన
ఇద్దరు చిన్నారులు విశాఖలో ప్రత్యక్షమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల
ప్రకారం..కుత్బుల్లాపూర్‌కు చెందిన 12ఏళ్ల బాలుడు టమాటాలు తీసుకురావడానికి తన స్నేహితుడితో
కలిసి బయటకు వెళ్లాడు. ఇంటి పక్కనే ఉంటున్న తన స్నేహితుడిని (12) వెంట
తీసుకొని 14న రాత్రి 8.30 గంటలకు టమాటాలు తీసుకొద్దామని సైకిల్‌పై కలిసి
వెళ్లారు. ఎంత సేపయినా ఇంటికి రాకపోయేసరికి
కంగారు పడిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా వారి ఆచూకీ తెలియకపోవడంతో
పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిన్నారులిద్దరూ పబ్జీ
గేమ్‌కు బాగా అలవాటు ఉందని తెలిసింది. ఇంట్లోంచి ఎందుకోసం వెళ్లారనేది తెలియలేదు.
విశాఖ ఎలా వెళ్లారన్న వివరాలు తెలియాల్సి ఉంది. చిన్నారులు నగరానికి వచ్చిన
తర్వాతనే పోలీసుల ఈ వివరాల్ని వివరించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం విశాఖ రైల్వే
స్టేషన్, పరిసర
ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు చిన్నారులను విశాఖ త్రీ టౌన్
పోలీసులు గుర్తించారు. వారిద్దర్నీ చేరదీసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు
చిన్నారుల ఆచూకీ కనుగొన్న విశాఖ త్రీ టౌన్ పోలీసులు గుర్తించి పేట్‌బషీరాబాద్
పోలీసులకు సమాచారం అందించారు వెంటనే ఇన్‌స్పెక్టర్
రమేష్ ఒక పోలీస్ బృందాన్ని విశాఖకు పంపారు. చిన్నారులిద్దరూ క్షేమంగా ఉండటంతో
తల్లిదండ్రులు ఆనందించారు.