దారుణం.. ప్రియుడిపై యువతి యాసిడ్ దాడి..!
By: Anji Wed, 28 Oct 2020 10:15 PM
ప్రేమించిన సహాజీవనం చేస్తున్న ప్రియుడు దూరం పెడుతున్నాడన్న ఆక్రోశంతో ఓ యువతి అతడిపై యాసిడ్ తో దాడి చేసింది. ఈ దారుణ ఘటన త్రిపుర రాష్ర్టంలో చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. త్రిపుర రాష్ర్ట రాజధాని అగర్తలాకు 50 కిమీ దూరంలోని ప్రాంతానికి చెందిన బీనా(27), సోమన్(30) పక్కపక్క ఇళ్లలో ఉండేవారు.
పదేళ్ల కిందట ఇద్దరు ప్రేమించుకొని ఇంటి నుంచి వెళ్లిపోయారు. 2010 నుంచి మహారాష్ర్టలోని పుణెలో సహాజీవనం చేస్తూ ఉంటున్నారు. అదే సమయంలో సోమన్ చదువు కొనసాగించడానికి అవసరమైన డబ్బులను బీనా ఉద్యోగం చేస్తూ సమకూర్చేది.
అనంతరం సోమన్‌కు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేస్తూ కాపురం చేస్తున్నారు. తొమ్మిదేళ్లుగా పుణెలో బీనాతో కలిసి ఉన్న సోమన్ 2019లో సొంత రాష్ట్రానికి తిరిగొచ్చేశాడు.
అప్పటి నుంచి ఆ వ్యక్తి బీనాతో మాట్లాడటం మానేశాడు. సోమన్ కోసం ఆ మహిళ సంవత్సరం నుంచి చాలా ప్రాంతాల్లో వెతికినా అతని ఆచూకీ లభించలేదు. ఎట్టకేలకు అక్టోబరు 19న త్రిపురలోని ఖోవై ప్రాంతంలో సోమన్‌ను ఉన్నట్లు బీనా గుర్తించింది.
అతనితో మాట్లాడటానికి ఎంతగా ప్రయత్నించినా సోమన్ నిరాకరించడంతో ఆమె విచక్షణ కోల్పోంది. ఇదే క్రమంలో తనతో మాట్లాడకుండా దూరం పెడుతున్నాడన్న కోపంతో ఉన్న అతనిపై యాసిడ్‌తో దాడి చేశారు.
ఈ ఘటనలో సోమన్ తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు బీనాను అరెస్టు చేశారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.