ఎన్నికల మార్గదర్శకాలు విడుదల చేసిన జీహెచ్‌ఎంసీ
By: Sankar Thu, 19 Nov 2020 11:52 PM
గ్రేటర్‌లో అభ్యర్థులు, పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వెలువరించింది. గోడలమీద వ్రాతలు, పోస్టర్లు అంటించడం నిషేధించింది.
వీలైనంత మేర ప్లాస్టిక్, పాలిథిన్ బ్యానర్లు నివారించాలంది. ఎన్నికల కరపత్రంపై ముద్రించినవారి పేరు, అడ్రస్ ఉండాలని తెలిపింది. ప్రత్యేక ఉపకరణాల ఖర్చును అభ్యర్థి వ్యవపట్టికలో నమోదు చేయాలని సూచించింది. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలంది. లౌడ్ స్పీకర్లకు అనుమతి పొందాలని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలోనే స్పీకర్లకు అనుమతి ఉన్నట్లు వెల్లడించింది.
ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్యలో రోడ్ షోలకు అనుమతిచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత బహిరంగ సమావేశాలపై అదేవిధంగా పోలింగ్‌కు 48 గంటల ముందే సమావేశాలను నిషేధించింది. సిబ్బంది ద్వారా ఓటర్లకు అధికారిక గుర్తింపు పత్రాలు అందజేస్తామంది.