Advertisement

నేడే ఐపీయల్ పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల

By: Sankar Fri, 04 Sept 2020 12:00 PM

నేడే ఐపీయల్ పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల


యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ జరుగుతుంది అని నెల కిందటే ప్రకటించిన బీసీసీఐ అధికారిక షెడ్యూల్ ను మాత్రం విడుదల చేయలేదు. దానికి ప్రధాన కారణం ఐపీఎల్ జరుగుతున్న మూడు వేదికలో వైరస్ రూల్స్ కఠినంగా ఉండటమే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన 13 మందికి కరోనా సోకడం ఐపీఎల్ షెడ్యూల్ విడుదలను ఆలస్యం చేసింది.

ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదల కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో టీం ఇండియా మాజీ కెప్టెన్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ శుభవార్తను అందించాడు. ఈ రోజు అంటే సెప్టెంబర్ 4 న ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపాడు. ''సెప్టెంబర్ 4 న ఐపీఎల్ 2020 పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేస్తుంది అని దాదా అన్నాడు. అయితే గతేడాది ఐపీఎల్ విన్నర్ ముంబై ఇండియన్స్ తో సిఎస్కే ఆరంభ మ్యాచ్ ఆడాలి.

కానీ కరోనా రావడంతో క్వారంటైన్ లో ఉన్న చెన్నై టీం ఇంకా ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు. అందువల్ల ధోని జట్టుకు సాధన చేయడానికి తగినంత సమయం ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. అదే జరిగితే మొదటి మ్యాచ్ లో చెన్నై స్థానంలో మరో జట్టుకు అవకాశం ఇవ్వనున్నారు. ఆ జట్టు ఆర్సీబీ అని తెలుస్తుంది. మొదటి మ్యాచ్ ను స్టార్స్ ఆటగాళ్లతో ఆరంభించాలని ఐపీఎల్ నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. అందుకే అధికంగా ఫాలోయింగ్ ఉన్న కోహ్లీ జట్టుకు ఆ ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

Tags :

Advertisement