'ఎయిర్‌టెల్' సఫా జరీన్ కు ఉచితంగా ఇంట్లో డీటీహెచ్ ఏర్పాటు
By: chandrasekar Sat, 12 Sept 2020 12:14 PM
తెలంగాణా ప్రభుత్వం
విద్యార్థుల కోసం సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ విధానంలో టీ సాట్ ద్వారా తరగతులు
నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా విద్యాబోధన కొనసాగుతుండటంతో పలు ప్రాంతాల్లో
విద్యార్థులు మౌలిక సదుపాయాల కోసం కష్టపడాల్సి వస్తుంది. నిర్మల్ జిల్లా రాజూర
గ్రామానికి చెందిన 12ఏండ్ల సఫా జరీన్ 7వ తరగతి చదువుతున్నది. ఇంటివద్ద ఇంటర్నెట్
అందుబాటులో లేకపోవడంతో సఫా జరీన్ ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కాలేక పోయేది. దీంతో
ఆమె ప్రతిరోజు 2 కిలోమీటర్లు నడిచి ఉదయం 11
గంటలకల్లా తమ పొలం వద్దకు చేరుకునేది. అక్కడే
మంచెపై కూర్చుని 2 గంటలపాటు ఆన్‌లైన్ క్లాసులు వింటుండేది.
ఈ విషయం తెలుసుకున్న
ఎయిర్‌టెల్ సంస్థ రాజురలో సఫా జరీన్ ఇంటికి వెళ్లి నిరుపేద కుటుంబం అయిన సఫా
జరీన్ చదువుకి ఆటంకం కలగకుండా ఇక ఇంటినుంచి ఆన్లైన్ తరగతులు వినడానికి వీలుగా
ఉచితంగా ఎయిర్‌టెల్ డీటీహెచ్ ఏర్పాటు చేసింది. " ఇంతకు ముందు నేను 2
కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి పొలంలో కూర్చొని ఆన్లైన్ తరగతుల కు హాజరయ్యేదాన్ని
అది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అది
చూసిన ఎయిర్‌టెల్ వారు నాకోసం ఉచితంగా మా ఇంట్లో ఎయిర్‌టెల్ డీటీహెచ్ ఏర్పాటు
చేసారు. ఇదినాకు ఎంతో సహాయంగా ఉంది ఇప్పుడు నేను ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్
తరగతులకు అటెండ్ అవుతున్నాను. ఎయిర్‌టెల్ బృందానికి ధన్యవాదాలు నాకు చాలా
సంతోషంగా ఉందని విద్యార్దిని సఫా జరీన్
తెలిపింది.