Advertisement

  • స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో మోసం...9 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌ .

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో మోసం...9 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌ .

By: chandrasekar Mon, 14 Sept 2020 12:09 PM

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో మోసం...9 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌ .


స్టాక్‌మార్కెట్‌లో రూ. 30 వేలు పెట్టుబడి పెడితే 5 నెలల్లో 10 రెట్లు అయ్యేలా చేస్తామంటూ ఈ నిందితులు ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ‘టాప్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌’ పేరిట సంస్థను ప్రారంభించి అమాయకుల నుంచి భారీగా డబ్బు దోచుకుంటున్నట్లు హైదరాబాద్ పోలీసులు తేల్చారు.

నిందితులు హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన సుధాకర్‌ అనే వ్యక్తిని స్టాక్‌మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మోసం చేశారు. ఆయన్ను మోసం చేసి రూ.9.6 లక్షల డబ్బును సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నట్లు గుర్తించారు. నిందితులను హైదరాబాద్‌ పోలీసులు మధ్యప్రదేశ్‌లోని సాగర్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం పీటీ వారంట్‌పై వారిని హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు.

Tags :
|

Advertisement