ఫ్రాన్స్ కు కూడా పాకిన కొత్త కరోనా వైరస్
By: Sankar Sat, 26 Dec 2020 4:02 PM
బ్రిటన్ లో కొత్త కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి ..అయితే తాజాగా ఫ్రాన్స్‌లోనూ కొత్త రకం కరోనా కేసు నమోదు అయ్యింది. బ్రిటన్‌లో గుర్తించిన వేరియంట్ ఫ్రాన్స్‌లో కనిపించినట్లు అధికారులు తెలిపారు..
టూర్స్ పట్టణంలోని తమ పౌరుడికే ఆ వైరస్ సోకినట్లు ఫ్రెంచ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.. ఈ నెల 19వ తేదీన లండన్ నుంచి వచ్చాడు ఓ వ్యక్తి.. అయితే, అతనిలో లక్షణాలు లేకపోయినా.. పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం అతను హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్టు అధికారులు తెలిపారు..
ఇక కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ఇప్పుడు ఇతర దేశాలను టెన్షన్ పెడుతోంది.. ఇప్పటికే కొన్ని దేశాలు యూకే నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి... అయినా డిసెంబర్ నెలలో యూకే నుంచి, యూకే మీదుగా వెళ్లినవారికి కొంతమందికి కోవిడ్ పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.. భారత్‌లోనూ ఈ తరహా కేసులు వెలుగుచూడగా.. అయితే.. కొత్త స్ట్రెయినా లేక పాతదేనా? అని తేల్చే పనిలో పడిపోయారు