కరోనా బారిన పడిన ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్
By: Sankar Thu, 17 Dec 2020 6:15 PM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి దెబ్బకు అనేక దేశాలు అతలాకుతలం అయ్యాయి ...కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులూ , సెలెబ్రిటీలు ఇలా అనేకమంది కరోనా బారిన పడ్డారు ..
అమెరికా అధ్యక్షుడి దగ్గరి నుంచి ఆఫ్రికా లో మారుమూల దేశ ప్రధాని వరకు చాలా మంది దేశ అధ్యక్షులు కరోనా బారిన పడ్డారు..అయితే తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు...
వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాటిజివ్‌గా నిర్థారణ అయింది. దీంతో మాక్రాన్ వారంపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఈ మేరకు ఎలీసీ ప్యాలెస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఫ్రాన్స్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వారం పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.
ఇక కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి దేశంలో ఇప్పటివరకు రెండు మిలియన్ల మందికి వైరస్ సోకింది. మహమ్మారి బారిన పడి 59,400 మందికి పైగా మరణించారు