Advertisement

  • గోవాలో ఐపీఎల్ బెట్టింగ్‌ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు...నలుగురు అరెస్ట్

గోవాలో ఐపీఎల్ బెట్టింగ్‌ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు...నలుగురు అరెస్ట్

By: chandrasekar Tue, 13 Oct 2020 2:54 PM

గోవాలో ఐపీఎల్ బెట్టింగ్‌ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు...నలుగురు అరెస్ట్


ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి గోవా పోలీసు బృందాలు రాష్ట్రంలో ఆరు కంటే ఎక్కువ బెట్టింగ్‌ ముఠాలను అదుపులోకి తీసుకున్నాయి. తాజాగా విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పనాజీ సమీపంలోని రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగ్ రాకెట్‌ను గోవా పోలీసులు ఛేదించారు. ఈ రాకెట్టును నడుపుతున్న నలుగురు ఛత్తీస్‌గఢ్‌ వాసులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి గోవాలోని పలు ప్రాంతాల్లో జోరుగా బెట్టింగ్‌ జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు కచ్చితంగా అందిన సమాచారం మేరకు పనాజీ సమీపంలోని ఓ రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి చేసారు.

పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్‌ వస్తువుల ద్వారా బెట్టింగ్‌ జరుగుతున్నట్లు తేలింది. పనాజీ కేంద్రంగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్‌ నిర్వాహకులు రాయ్‌పూర్‌కు చెందిన రంజోత్ సింగ్ చబ్రా, సునీల్ మోత్వానీ, కపిల్ తోలాని, వినయ్ గంగ్వానీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠా ఇప్పటికే రూ.50 లక్షల విలువైన పందాలను అంగీకరించారు. "ఛత్తీస్‌గఢ్‌‌లోని తమ ఖాతాదారుల నుంచి ఫోన్‌లో పందెం స్వీకరిస్తున్నారు. బెట్టింగ్‌ స్థావరంపై దాడి జరిపి అనేక మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నాం. ఈ ముఠా ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు రూ.50 లక్షల వరకు పందెంగా తీసుకున్నారు" అని పోలీసు సూపరింటెండెంట్ శోభిత్ సక్సేనా చెప్పారు.

Tags :
|
|

Advertisement