Advertisement

  • బాక్సింగ్ డే టెస్ట్ ...రహానే కెప్టెన్సీపై ప్రశంసల వర్షం

బాక్సింగ్ డే టెస్ట్ ...రహానే కెప్టెన్సీపై ప్రశంసల వర్షం

By: Sankar Sun, 27 Dec 2020 07:44 AM

బాక్సింగ్ డే టెస్ట్ ...రహానే కెప్టెన్సీపై ప్రశంసల వర్షం


ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులకే కట్టడి చేసారు..

అయితే ఈ మ్యాచ్ కు రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ లేకపోవడంతో రహానే కెప్టెన్ గా వ్యవహరించాడు...అయితే మ్యాచ్ కు ముందు చాలామంది రహానే కెప్టెన్సీ మీద సందేహం వ్యక్తం చేసారు..కానీ తొలి రోజు ఆట ముగిసాక రహానే కెప్టెన్సీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు...

ఈ మ్యాచ్ లో రహానే తీసుకున్న నిర్ణయాలు ఫలించాయని పేర్కొన్నారు. మ్యాచ్ ఆరంభంలోనే స్పిన్నర్ అశ్విన్ కు బంతిని అప్పగించడం అలాగే మొదటి సెషన్ లో సిరాజ్ కు బౌలింగ్ ఇవ్వకుండా రెండో సెషన్ లో అతనికి బౌలింగ్ ఇవ్వడం వంటి ప్రయత్నాలు పని చేసాయి అని తెలుపుతున్నారు. అలాగే మొదటి రోజు మ్యాచ్ లో బౌలర్లు తమ పని పూర్తిచేశారు అని... ఇక బ్యాట్స్మెన్స్ పనే మిగిలివుంది అని తెలిపారు.

Tags :
|

Advertisement