అస్సాంలో వరద బీభత్సం సృష్టిస్తుంది
By: chandrasekar Tue, 28 July 2020 9:47 PM
అస్సాం రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరద బీభత్సానికి 5305 గ్రామాల్లో వందలాది గృహాలు నీటమునిగాయి. దాదాపు 25 వేల మంది ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 30 జిల్లాల్లో 56 లక్షల మందిపై వరదల ప్రభావం అధికంగా ఉంది. ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం 615 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది.
దాదాపు 1.5 లక్షల మంది ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. ఇప్పటి వరకు వరదల కారణంగా 103 మంది మృతి చెందారు. మృతులకు అస్సాం ప్రభుత్వం నాలుగు లక్షల పరిహారాన్ని ప్రకటించింది. వరదల కారణంగా 2,59,899 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. కజిరంగా నేషనల్ పార్క్‌లో భారీగా వరద నీరు రావడంతో వందలాది వన్యప్రాణాలు చనిపోయాయి.
Tags :
floods |
create |
havoc |