Advertisement

  • పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య కాల్పులు

పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య కాల్పులు

By: chandrasekar Wed, 21 Oct 2020 5:40 PM

పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య కాల్పులు


దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా కాకపోరాలోని హక్రిపోరా ప్రాంతంలో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.

హక్రిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతాదళాలకు విశ్వసనీయ సమాచారం అందడంతో 50 రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్‌పీఎఫ్‌ కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు.

ఉగ్రవాదులు దాక్కున్నట్లు అనుమానిస్తున్న ప్రాంతానికి చేరుకోగానే భద్రతా దళాలపైకి ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.

దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడినట్లు సమాచారం.

Tags :
|

Advertisement