ఆంధ్రప్రదేశ్లో నివర్ తుఫాన్ బాధితులకు ఆర్థికసాయం
By: chandrasekar Fri, 27 Nov 2020 10:27 PM
భారీ తుఫానుగా తీవ్రరూపం
దాల్చిన నివర్ తుఫాను బాధితులకు ఏపీ ప్రభుత్వం నగదు సహాయం అందించనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్
సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించింది. నివర్ తుఫాన్ బాధితులకు ఆర్థికసాయం
అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
రాష్ట్రంలో సముద్ర తీర
ప్రాంతాల్లో ఈ తుఫాను బారిన పడి నష్టాన్ని సంధించారు. నివర్ తుపానుపై మంత్రివర్గ
సమావేశంలో చర్చ జరిగింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 289 సెంటీమీటర్ల వర్షపాతం
నమోదైనట్లు అధికారులు గుర్తించారు. 10 వేల మందికి పైగా సహాయక శిబిరాలకు తరలించారు.
శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 నగదు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు అని మంత్రి
కురసాల కన్నబాబు కేబినెట్ సమావేశం అనంతరం వెల్లడించారు.