ఉచితంగా రైతులకు బీమా సౌకర్యం
By: chandrasekar Sat, 27 June 2020 10:58 AM
ఆంధ్రప్రదేశ్‌లో రైతు
భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ నమోదు చేసి ప్రభుత్వమే రైతులకు ఉచితంగా బీమా
సౌకర్యం కల్పిస్తుందని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
శుక్రవారం 2018 రబీ
పంటల బీమా సొమ్మును తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేశారు. 13
జిల్లాల్లోని 5 లక్షల 49వేల మంది రైతుల ఖాతాల్లో రూ.596.36 కోట్లు నేరుగా జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ గత ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.122
కోట్లను తామే చెల్లిస్తున్నామని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రబీ పంటల
బీమా కింద బీమా కంపెనీలకు ప్రీమియంను చెల్లించలేదని పేర్కొన్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సలహాలు, సూచనలు
అందిస్తామని ఆయన తెలిపారు. రైతులు వేసిన ప్రతీ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని
ఆయన వెల్లడించారు. గత తెలుగుదేశం పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని సీఎం జగన్
ఆరోపించారు. వైఎస్సార్ కడప జిల్లాలో 2,14,416 మంది రైతులకు, కర్నూలు జిల్లాలో 1,57,956, ప్రకాశం జిల్లాలో 1,06,085 మంది రైతులకు, అనంతపురంలో 82,848 మంది రైతులతో పాటు మరో 9
జిల్లాల రైతులకు బీమా సొమ్ము ఇవ్వనుంది.