Advertisement

  • ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ వన్డే సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల

ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ వన్డే సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల

By: chandrasekar Wed, 22 July 2020 2:27 PM

ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ వన్డే సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల


అంతర్జాతీయ క్రికెట్‌ ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌తో మరలా ప్రారంభమైంది. బయో సెక్యూర్‌ విధానంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు టెస్టులు విజయవంతంగా ముగియడంతో మిగతా దేశాలు కూడా క్రికెట్‌ కార్యకలాపాలు మొదలెట్టాయి. ఓవైపు టెస్టు సిరీస్‌ జరుగుతుండగానే ఇంగ్లీష్‌ టీమ్‌ మరో సిరీస్‌కు రెడీ అవుతోంది.

ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ వన్డే సిరీస్‌ షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. ఐర్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీని ఇంగ్లాండ్‌ వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. మూడు వన్డేల సిరీస్‌లో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌కు అలీ సహాయం చేయనున్నాడు.

మూడు మ్యాచ్‌లకు సౌతాంప్టన్‌ ఆతిథ్యమివ్వనుంది. సిరీస్‌ ఆరంభానికి ముందు ఆతిథ్య జట్టు రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను ఆడనుంది. ఫస్ట్‌ మ్యాచ్‌ వచ్చే మంగళవారం జరగనుండగా రెండోది శుక్రవారం నిర్వహించనున్నారు.

ఇప్పటికే ఇరు జట్లు కూడా హాంప్‌షైర్‌ వేదిక వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ఉన్నాయి. ఐర్లాండ్‌తో ఇంగ్లాండ్‌ లయన్స్‌ మ్యాచ్‌ ఆదివారం జరుగుతుంది. జూలై 30, ఆగస్టు 1, ఆగస్టు 4వ తేదీల్లో వన్డేలు బయో సెక్యూర్‌ బబుల్‌ విధానంలో జరగనున్నాయి.

Tags :

Advertisement