Advertisement

ఏలూరు ఆశ్రం కోవిద్ ఆస్పత్రిలో దారుణం

By: chandrasekar Mon, 27 July 2020 08:22 AM

ఏలూరు ఆశ్రం కోవిద్ ఆస్పత్రిలో దారుణం


ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కరోనా ఆస్పత్రిలో దారుణం జరిగింది. కరోనా బాధితురాలిని డిశ్చార్జి చేస్తామని ఆమె బంధువులకు సమాచారం ఇచ్చిన అధికారులు తర్వాత ఆమె కనిపించడంలేదని చెప్పారు. తీరా రికార్డులు పరిశీలించగా బాధితురాలు మృతి చెందినట్లుగా ఉంది. దీంతో మృతురాలి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

జిల్లాలోని పెదవేగి మండలం కూచుంపూడి గ్రామానికి చెందిన కళాతోటి అన్నపూర్ణకు కరోనా సోకడంతో ఈ నెల 13వ తేదీన ఏలూరు ఆశ్రం కరోనా ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆమెను డిశ్చార్జి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా అధికారులు మెసేజ్ ఇచ్చారు. దీంతో బంధువులు ఆస్పత్రికి రాగా, ఆ రోజు డిశ్చార్జి చేయడం కుదరదన్నారు. తిరిగి శనివారం రోజు ఆమె కుమారుడు ఆస్పత్రికి ఫోన్ చేయగా డిశ్చార్జి చేస్తామన్నారు.

దీంతో వారు ఆస్పత్రికి రాగా సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పారు. చివరికి ఆమె కనిపించడం లేదని, అన్నపూర్ణ చనిపోయిందని చెప్పారు. కనీసం ఆమె మృతదేహాన్ని అయినా చూపించాలని వేడుకున్నారు. అది కూడా సాధ్యం కాదనే సమాధానం వచ్చంది. దీంతో మృతిరాలి బంధువులు అధికారులపై మండిపడ్డారు.

Tags :

Advertisement