దుబ్బాక ఉపఎన్నికలో కూడా ఇవే ఫలితాలొస్తాయి: మంత్రి హరీశ్ రావు
By: chandrasekar Mon, 12 Oct 2020 5:59 PM
టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి
నిజామబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని, దుబ్బాక
ఉపఎన్నికలో కూడా ఇవే ఫలితాలొస్తాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట వైస్ ఎంపీపీ, బీజేపీ
నేత రామచంద్రం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.
నిజామాబాద్ ఎమ్మెల్సీ
ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల డిపాజిట్లు గల్లంతయ్యాయని అన్నారు. రేపు
జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలతో
కాంగ్రెస్, బీజేపీల గోబెల్స్ ప్రచారాలు, సోషల్
మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అబద్ధాలని రుజువయ్యాయని చెప్పారు.
మొన్న హుజూర్ నగర్, నేడు నిజామాబాద్, రేపు దుబ్బాక, ఎల్లుండి జీహెచ్ఎంసీ. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్
పార్టీదే అని తెలిపారు.