భూటాన్ సరిహద్దులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు డ్రాగన్ దేశం ఎత్తులు
By: chandrasekar Mon, 14 Sept 2020 4:38 PM
చైనా భూటాన్ సరిహద్దు
ప్రాంతాలపై కన్నేసింది. మొదట్నుంచి చైనా పలు దేశాలతో ఘర్షణకు దిగుతోంది. ఇప్పటి వరకు వాస్తవాధీన రేఖ వెంబడి
ఉద్రిక్తలకు కారణమైన చైనా ఆ తర్వాత దక్షిణ చైనా సముద్రం విషయంలోనూ పలు దేశాలతో
ఘర్షణకు సిద్ధమైంది. తాజాగా ఇప్పుడు మరో పొరుగు దేశమైన భూటాన్‌తో ఉన్న సరిహద్దులను
తమకు అనుకూలంగా మార్చుకునేందుకు డ్రాగన్ దేశం ఎత్తులు వేస్తోంది. చైనా, భూటాన్
దేశాల మధ్య ఈ అంశంపై 25వ సారి సరిహద్దు చర్చలు జరగనున్నాయి. కాగా, పీఎల్ఏ
బలప్రదర్శనలతో భూటాన్ కొంత ఆందోళన చెందుతోంది. ఇప్పటికే పలు సరిహద్దు ప్రాంతాలను
ఆక్రమించుకునేందుకు సిద్ధంగా చైనా బలగాలు ఉండగా ఈ చర్చలు ఏమేర ఫలవంతమవుతాయనేది
అనుమానమే.
భారత్-చైనాకు మధ్యలో ఉన్న
భూటాన్ సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు డ్రాగన్ ఎప్పట్నుంచో
ప్రయత్నిస్తూనే ఉంది. అయితే, భూటాన్ దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. పలుమార్లు భారత్
కూడా భూటాన్‌కు అండగా నిలిచింది. ఒకవేళ భూటాన్ చైనా మంద బలానికి తలొగ్గి ఏవైనా
సరిహద్దు ప్రాంతాలను ఆ దేశానికి వదిలేసినట్లయితే భారత్ సరిహద్దు భద్రతపై ప్రతికూల
ప్రభావం చూపే అవకాశం ఉండేది. 2017లో భూటాన్‌కు చెందిన డోక్లాం ప్లాటూను
ఆక్రమించుకునేందుకు వచ్చిన చైనా బలగాలను భారత ఆర్మీ అడ్డుకుంది. సుమారు 73
రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. చివరకు చైనా బలగాలు అక్కడ్నుంచి వెనుదిరిగాయి.
దీంతో భూటాన్ ఆ ప్రాంతాన్ని కాపాడుకోగలిగింది. భూటాన్‌కు భారత్ మద్దతుగా నిలవడంపై
చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా భారత్.. భూటాన్‌కు మద్దతివ్వడం ఆపలేదు.