తాత్కాలికంగా వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉండాలనుకుంటున్న ధోనీ
By: chandrasekar Thu, 09 July 2020 5:43 PM
కరోనా వైరస్ వ్యాప్తి
నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. నాలుగు
నెలలుగా క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోవడంతో తన పొలం పనులు చేసుకుంటున్నాడు ధోని.
తాత్కాలికంగా వాణిజ్య
ప్రకటనలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడట. ధోని బ్రాండ్ విలువ గురించి కొత్తగా
చెప్పాల్సిన పని లేదు. ప్రచార ఒప్పందాల కోసం అతడి వెంట పడే వారు తక్కువేమీ కాదట.
అయితే ప్రస్తుతం కరోనా
నేపథ్యంలో కొత్తగా ప్రకటనలేవీ చేయొద్దని మహీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రకటనల
కోసం సంస్థలు సంప్రదిస్తుంటే ఇప్పుడు చేయనని చెప్పేస్తున్నాడట.
అయితే సేంద్రీయ
వ్యవసాయానికి మాత్రం బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నాడు. అంతేకాదు తన సొంత
సేంద్రీయ ఎరువు బ్రాండ్‌ను ధోనీ త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నాడు.