ఏడు రోజుల పాటు అమెజాన్‌పై నిషేధం విధించాలని డిమాండ్
By: chandrasekar Fri, 27 Nov 2020 10:12 PM
దేశంలో ఇప్పుడు ఆన్ లైన్
షాపింగ్ అలవాట్లు ప్రజల్లో చాలానే పెరిగింది. ఇప్పుడంతా ఆన్‌లైన్ షాపింగ్ కాలం
నడుస్తోంది. షాపులకు వెళ్లి చూసి కొనుగోలు చేయడం మనలో చాలా మంది మానేశారు. స్మార్ట్‌ఫోన్‌తోనే
అరచేతిలోనే అన్ని వస్తువులను చూస్తున్నారు. నచ్చిన వాటిని సింగిల్ క్లిక్‌తో
కొనుగోలు చేస్తున్నారు. బయటకు వెళ్లే శ్రమ లేకుండా నేరుగా ఇంటికే వస్తువులు
వచ్చేస్తున్నాయి. అందుకే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్ల అమ్మకాలు విపరీతంగా
పుంజుకున్నాయి.
కానీ ఆన్ లైన్ ద్వారా ఈ
కామర్స్‌లో అమ్ముతున్న వస్తువులను సంబంధించి కేంద్రం ఓ నిబంధన విధించింది. ఆ
వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయో స్పష్టం చేయాలని సూచించింది. కానీ అమెజాన్
ప్రభుత్వం ఆ రూల్‌ని పదే పదే ఉల్లంఘిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల అమెజాన్ సంస్థకు
కేంద్ర ప్రభుత్వం రూ.25వేల జరిమానాను విధించింది. ఐతే ఈ జరిమానాను CAIT - కాన్ఫెడరేషన్ అఫ్ అల్
ఇండియా ట్రేడర్స్ తీవ్రంగా
తప్పుబట్టింది.
ఇందుకోసం మన భారత
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే అంత తక్కువ జరిమానా విధించి సరిపెట్టుకుంటారా? అని
కేంద్రంపై విమర్శలు గుప్పించింది. ఈకామర్స్ దిగ్గజ సంస్థకు రూ.25వేలు
పెద్ద లెక్కా? అని మండిపడుతోంది. నిబంధనలను ఉల్లంఘించిన అమెజాన్‌పై మరోసారి తప్పుచేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని
స్పష్టం చేసింది. కనీసం ఏడు రోజుల పాటు అమెజాన్‌పై నిషేధం విధించాలని డిమాండ్
చేసింది. లేదంటే మన దేశ చట్టాలు ఎగతాళికి గురయ్యే అవకాశముందని అభిప్రాయపడింది.