ఐపీయల్ లో మరొక టీంలో కరోనా కల్లోలం..
By: Sankar Mon, 07 Sept 2020 08:18 AM
ఒకవైపు ఐపీయల్ నిర్వహణకు అన్ని పనులు చకచకా జరుగుతుంటే మరో వైపు కరోనా కేసులు ఫ్రాంచేజిలను వెంటాడుతున్నాయి..నిన్న మొన్నటి దాకా చెన్నై సూపర్ కింగ్స్ టీంలోని ఆటగాళ్లు , సపోర్ట్ స్టాఫ్ కరోనా బారిన పడ్డారు..ఇప్పుడు వారందరికీ నెగటివ్ రావడంతో అందరు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోక టీంలో కరోనా కల్లోలం మొదలయింది..
ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆలస్యంగా అక్కడికి చేరుకున్న ఈ ఫిజియోథెరపిస్ట్ ఆరు రోజుల క్వారంటైన్ సమయం లో మొదట చేసిన రెండు కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చింది. కానీ చివరి రోజు చేసిన మూడో పరీక్షలో మాత్రం పాజిటివ్ వచ్చింది. అతను ప్రస్తుతం నిర్బంధం లో ఉన్నాడు'' అని ఫ్రాంచైజ్ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.
అయితే అతను దుబాయ్ కు వచ్చిన వెంటనే ఎవరిని కలవకుండా క్వారంటైన్ కు వెళ్ళాడు అని తెలిపారు. ఇక అతను మళ్ళీ ఆటగాళ్లతో కలవడానికి ముందు 14 ఐసోలేషన్ లో ఉండాలి. ఆ తర్వాత అతనికి నెగెటివ్ వస్తే మళ్ళీ జట్టులో చేరుతాడు.