ఆంధ్రప్రదేశ్‌లో పడిపోయిన కరోనా వైరస్ కేసులు, మరణాలు...
By: chandrasekar Mon, 14 Dec 2020 10:54 PM
ఆంధ్రప్రదేశ్‌లో
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,08,75,925 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో
తెలిపింది. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24
గంటల్లో 44,935 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 305
మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,75,836కి చేరింది.
సోమవారం కరోనా మహమ్మారి
బారిన పడి ఇద్దరు మరణించారు. నెల్లూరు జిల్లాలో ఇద్దరు కరోనా బారిన పడి మరణించారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,059కు
చేరింది. సోమవారం 541 మంది కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో 8,64,049 మంది కరోనా నుంచి
పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,728కు ఉన్నాయి.