మూడు నెలల తర్వాత ఫ్యామిలీని కలుసుకున్న వార్నర్
By: Sankar Fri, 27 Nov 2020 6:55 PM
ఆస్ట్రేలియన్ విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ 108 రోజుల తరువాత తన కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ తండ్రిని చూసిన వార్నర్ ముగ్గురు కుమార్తెలు అతడిని గట్టిగా హత్తుకున్నారు. ఈ వీడియోను ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్. కామ్ తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. హోటల్ క్వారంటైన్ ముగించుకొని ఎట్టకేలకు వార్నర్ తన కుటుంబాన్ని కలుసుకున్నారంటూ అందులో కామెంట్ పెట్టింది.
కాగా ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్ కోసం ఆగష్టులో వార్నర్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇక ఆ తరువాత ఐపీఎల్ 13 సీజన్ కోసం అటు నుంచి అటే దుబాయ్‌కి వెళ్లారు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన వార్నర్.. ఆ జట్టు రెండో క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయిన తరువాత ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లారు.
కానీ కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియాలో కఠిన నిబంధనలు ఉండటంతో వార్నర్ 14 రోజుల పాటు హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండి, తాజాగా తన ఇంటికి వెళ్లారు. ఇక తన కుటుంబంతో తీసుకున్న ఫొటోను షేర్ చేసుకున్న వార్నర్.. ”108 రోజుల తరువాత మళ్లీ నా వారిని కలుసుకున్నా. ఇప్పటికీ ఇస్లా(మూడో కుమార్తె) నా మీద కూర్చోవడం లేదు, గ్రూప్ పిక్‌లో స్మైల్ ఇవ్వడం లేదు. హ్యాపీ ప్లేస్” అని కామెంట్ పెట్టారు..