మహర్షి సినిమా డైలాగులతో ఏడాదికి ఫినిషింగ్ టచ్ ఇచ్చిన వార్నర్
By: Sankar Thu, 31 Dec 2020 10:54 PM
ఈ ఏడాది కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ సమయంలో తన టిక్ టాక్ వీడియోలతో అభిమానులను ఉర్రుతలూగించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాదికి ఫినిషింగ్ టచ్ అదే స్థాయిలో ఇచ్చాడు..సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' సినిమా టీజర్‌ను ఎడిట్ చేశాడు. మహర్షిలా కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. సినిమాలోని కొన్ని సీన్స్‌లో మహేశ్ ముఖానికి బదులు వార్నర్ తన ఫొటోని యాడ్ చేసి డైలాగ్స్‌తో అలరించాడు..
మరికొన్ని గంటల్లో 2020 ముగుస్తుంది.. విషాదంతో నిండిన ఈ ఏడాదిలో చివరిరోజును హాయిగా నవ్వుకుంటూ ముగిద్దాం' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఏడాది కరోనా లాక్‌డౌన్ నుంచి తెలుగు సినిమా పాటలు, డైలాగులు, హీరోల హావభావాలతో వీడియో రూపొందించి అలరించాడు.
ముఖ్యంగా టిక్‌టాక్ వీడియోలతో అటు తెలుగు ప్రజలకు.. ఇటు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. కాగా గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమైన వార్నర్ మూడో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. ఇరు జట్ల మధ్య జనవరి 7న సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది