హైదరాబాద్ నిర్మాణం కెసిఆర్ పాలన నుంచే మొదలయినట్లు చూయిస్తున్నారు..సిపిఐ నారాయణ
By: Sankar Fri, 10 July 2020 8:35 PM
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీద సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విరుచుకుపడ్డాడు ..ముఖ్యమంత్రి ఫామ్ హౌస్‌లో పడుకున్నారు. ఆయనకు కోవిడ్ వచ్చిందని ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ, ఆయనకు వచ్చిందని నేనేమీ అనుకోను. ఆయన చాలా తెలివైనవారు. ప్రజలందరికీ కోవిడ్ తెప్పిస్తారు గాని ఆయన తెచ్చుకోరు. కోవిడ్ పేషెంట్లకు సచివాలయంలో చికిత్స అందించాలి. కానీ, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పురాతన భవనాలు కూల్చి కొత్తవి కట్టడం.. చావప్పుడు పెళ్లి చేసుకోవడం తప్ప మరొకటి కాదు’అని నారాయణ విమర్శించారు.
హైదరాబాద్ నగరానికి చరిత్రే లేదన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయంలాంటి పురాతన కట్టడాలను కూల్చడం సరైన పద్ధతికాదని హితవు పలికారు. ఢిల్లీలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సచివాలయం కూల్చివేసే సందర్భంగా నిజాం నవాబులను పొగిడే వాళ్లు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సీఎం కేసీఆర్ కూడా నిజాం నవాబును అనేకసార్లు పొగిడారు. నిజాం నవాబు వారసులు నాకు ఫోన్ చేసి మీరు.. నిజాం నవాబును విమర్శిస్తున్నారు మంచిది కాదని హెచ్చరించారు.
కేసీఆర్ శకం నుంచే హైదరాబాద్ నిర్మాణమైనట్టు చూపిస్తున్నారు. గతంలో నిజాం నవాబు పరిపాలన గాని, పది మంది ముఖ్యమంత్రులు పాలించినట్లు గాని చెప్పకుండా తానే హైదరాబాద్ నిర్మించినట్లు చూపించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సచివాలయానికి అన్ని హంగులతో భవనాన్ని కట్టడానికి నేను ఎలాంటి అభ్యంతరం చెప్పను. కరోనా కేసులు అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా మారింది. కోవిడ్‌తో బాధపడుతున్నవారిని కాపాడాల్సింది పోయి సచివాలయం పడగొట్టడం అంటే మానవత్వ వ్యతిరేక చర్యే. దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు సరైన సమయం కాదు.