Advertisement

  • రాత్రికి రాత్రే ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా పేషెంట్

రాత్రికి రాత్రే ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా పేషెంట్

By: Sankar Sat, 01 Aug 2020 5:07 PM

రాత్రికి రాత్రే ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా పేషెంట్ఇటీవల కాలంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఆసుపత్రి నుంచి పారిపోతున్న సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి ..కొంతమంది అయితే టెస్ట్ కి వచ్చినపుడు ఫేక్ పేరు , ఫేక్ ఫోన్ నంబర్లు ఇస్తున్నారు ఒకవేళ వారికి పరీక్షల్లో కరోనా పాజిటివ్ వస్తే వారిని ట్రేస్ చేయడం అధికారులు కష్టంగా మారింది ..కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది ..

కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్‌ వ్యక్తి గురువారం అర్ధరాత్రి పారిపోయాడు. ఆ వ్యక్తి అశ్వారాపుపేట మండలం నాచారం గ్రామానికి చెందిన పిల్లి వెంకటేశ్వర్లుగా గుర్తించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సరళ తెలిపారు.

వెంకటేశ్వర్లు పారిపోయిన విషయంను అశ్వారావుపేట పోలీసులు, అక్కడి ఆస్పత్రి వైద్యులకు సమాచారమిచ్చామని తెలిపారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో భయాందోళన చెంది వెంకటేశ్వర్లు వార్డు నుంచి పారిపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఒక్క రోజులో 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,083 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 64,786 కు చేరింది. ఈ మేరకు శనివారం ఉదయం తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది.

Tags :
|

Advertisement