బ్రెజిల్‌లో కారులో పెళ్లి చేసుకున్న జంట
By: chandrasekar Mon, 01 June 2020 10:23 PM
బ్రెజిల్‌కు చెందిన జోవా
బ్లాంక్, ఎరికా
బ్లాంక్‌లు అనే జంట ఏకమైంది. కారులో వచ్చిన ఆ జంట ముందుగా ప్రమాణాలను చదివారు.
ఉంగరాలను మార్చుకున్నారు తరువాత మాస్క్‌తోనే ముద్దు పెట్టుకుని పెళ్లి అనే బంధంతో
ఏకం అయ్యారు. పెళ్లి పూర్త యినట్టే వెంటనే అధికారులు వారికి వివాహ ధ్రువీకరణ పత్రం
ఇస్తారు.. తరువాత ఆ కారు వెళ్లిపోతుంది. మరో కారు మరో జంటతో వస్తుంది.
ఇలా 5
నిమిషాల్లో జంటలు ఏకం అవుతూనే ఉంటాయి. డ్రైవ్-త్రూ వివాహ వేడుకవైపు ఎక్కువగా
ఆకర్షితులు అవుతున్నారని తెలిసింది. కరోనా వైరస్‌ను అరికడుతూనే ఏకం అయ్యేందుకు ఇది
మంచి మార్గమని నవ దంపతులు అభిప్రా యపడ్డారు. కొన్ని చోట్ల వీడియో కాన్పరెన్స్
ద్వారా మరికొన్ని చోట్ల ఇలా డ్రైవ్-త్రూ పద్ధతిలో పెళ్లిళ్లు జరగటం విశేషం.
Tags :
couple |
married |
car |
in |