Advertisement

  • ఆర్మేనియా మరియు అజర్‌బైజాన్‌ మధ్య యుద్ధం మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చా?

ఆర్మేనియా మరియు అజర్‌బైజాన్‌ మధ్య యుద్ధం మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చా?

By: chandrasekar Sat, 03 Oct 2020 12:41 PM

ఆర్మేనియా మరియు అజర్‌బైజాన్‌ మధ్య యుద్ధం మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చా?


ఆర్మేనియా మరియు అజర్‌బైజాన్‌ మధ్య యుద్ధం మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చా అనే సందేహం వెలువడుతుంది. ఆసియా మైనర్‌ ప్రాంతంలో చిన్న రాజ్యాలైన ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ మధ్య భీకర యుద్ధం ఆరో రోజుకు చేరుకున్నది. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. క్రిస్టియన్లు అధికంగా ఉండే ఆర్మేనియా, ముస్లిం రాజ్యమైన అజర్‌బైజాన్‌ మధ్య నగొర్నో కరబఖ్‌ ప్రాంతం కోసం యుద్ధం ప్రారంభమైంది.

ప్రస్తుతం ఇరు దేశాల సరిహద్దుల్లో విరామం లేకుండా ఫిరంగులు పేలుతూనే ఉన్నాయి. ఆర్మేనియన్‌ జాతి ప్రజలు అధికంగా ఉండే నగొర్నో కరబఖ్‌ ప్రాంతం అజరబైజాన్‌లో భాగంగా ఉన్నది. దాంతో ఆ ప్రాంతాన్ని ఆర్మేనియాలో కలుపాలని అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. వారికి మద్దతుగా ఆర్మేనియా రంగంలోకి దిగటంతో యుద్ధం మొదలైంది.

అప్పుడు జర్మనీ పోలెండ్‌ను ఆక్రమించటంతో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్టుగానే ఇప్పుడు కూడా మూడో ప్రపంచ యుద్ధానికి ఈ చిన్నదేశాల యుద్ధం దారితీయవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం ఆర్మేనియాకు రష్యా, అజర్‌బైజాన్‌కు టర్కీ మద్దతుగా నిలువటమే. మద్దతివ్వటమే కాకుండా ఆయా దేశాల తరఫున త్వరలోనే యుద్ధంలోకి కూడా దిగవచ్చనే వార్తలు వస్తున్నాయి.

కానీ అజర్‌బైజాన్‌ తరఫున యుద్ధం చేసేందుకు పాకిస్థాన్‌ కూడా సైనికులను పంపినట్టు సమాచారం. ఈ యుద్ధంపై భారత్‌ ఆందోళన వ్యక్తంచేసింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ శుక్రవారం పిలుపునిచ్చారు. ఈ రెండు చిన్న దేశాలకు మరిన్ని దేశాలు మద్దతు పలకడంతో మూడో ప్రపంచ యుద్దానికి దారితీసినట్లవుతుంది.

Tags :
|
|

Advertisement