Advertisement

కరోనా వైరస్ కేసులు భారత్ లో కోటి దాటాయి....

By: chandrasekar Sat, 19 Dec 2020 6:12 PM

కరోనా వైరస్ కేసులు భారత్ లో కోటి దాటాయి....


భారత్ కరోనా వైరస్‌ కేసుల్లో కోటి దాటి అమెరికా తర్వాత రెండో దేశంగా నిలిచింది. కేరళలో జనవరి 30న తొలికేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు 95.5లక్షల మంది ఈ వైరస్ గురై కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ కి గురై మృతి చెందిన వారి సంఖ్య 1,45,136కు చేరింది.

ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.46శాతంగా ఉందని, మరణాల రేటు 1.45శాతంగా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా మహమ్మారి నుంచి 16కోట్లకుపైగా కరోనా నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

గడిచిన 24గంటల్లో దేశంలో దేశంలో 25,153 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య కోటి మార్క్‌ను దాటింది. తాజాగా 347 మంది వైరస్‌కు బలవగా తాజాగా 29,885 మంది కోలుకోగా ఇప్పటి వరకు 95,50,712 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.ఇప్పటి వరకు 16,00,90,154 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది. శుక్రవారం ఒకే రోజు 11,71,868 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. ప్రస్తుతం 3,08,751 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

Tags :
|
|
|
|

Advertisement