నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేకి కరోనా....
By: chandrasekar Sat, 24 Oct 2020 1:41 PM
కరోనా మహమ్మారి విజృంభణ
కొనసాగుతూనే ఉంది. ఎందరో దీనికి బలి అవుతున్నారు. సాధారణ ప్రజలు, రాజకీయ
నాయకులు యిలా ఎలాంటి తేడా లేడుండా దీని ప్రభావం చూపుతూనే ఉంది.
తాజాగా నాగర్‌కర్నూల్
ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి కొవిడ్ భారిన పడ్డారు. గత రెండు రోజులుగా ఆయన
స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు.
హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు
చేయించుకోగా ఫలితం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఎమ్మెల్యే హోం
క్వారంటైన్‌లోకి వెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే
మాట్లాడుతూ.. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు
ఆందోళన చెందవద్దని తెలిపారు. గత వారం రోజుల్లో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు
చేయించుకోవాల్సిందిగా, వైద్యపరంగా అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఎమ్మెల్యే
సూచించారు.