అర నిమిషంలోపే కరోనా ఫలితాలు
By: chandrasekar Sat, 10 Oct 2020 10:24 AM
న్యూ ఢిల్లీ:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఓవైపు కరోనా
వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతుండగానే మరోవైపు కరోనా పరీక్షల కిట్స్‌ని తక్కువ ధరలో, తక్కువ వ్యవధిలో ఫలితాలు
వచ్చేలా రూపొందించడం కోసం కూడా ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే
ఇండియా-ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కలిసి కరోనా టెస్టింగ్ కిట్స్‌పై చేస్తోన్న ప్రయోగాలు
చివరి దశకు చేరుకున్నాయి.
ప్రస్తుతం ప్రయోగాల చివరి
దశలో ఉన్న ఈ కిట్స్ అందుబాటులోకి వస్తే అర నిమిషంలోపే కరోనా ఫలితాలు లభిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా
టెస్టింగ్ కిట్స్ ప్రయోగం పూర్తయితే ఇండియా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తయారీకి మ్యానుఫ్యాక్చరింగ్
హబ్ అవుతుందని ఇజ్రాయెల్ రాయభారి రాన్ మల్క పేర్కొన్నారు. మరో రెండు, మూడు
వారాల్లో ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్
అందుబాటులోకి రానున్నట్టు రాన్ మల్క తెలిపారు. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌తో
తక్కువ ఖర్చుతో, స్వల్ప వ్యవధిలో కరోనా పరీక్షలు జరిపేందుకు ఆస్కారం
ఉంటుందని రాన్ మల్క స్పష్టంచేశారు.