Advertisement

దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేట్ ..

By: Sankar Sun, 25 Oct 2020 2:27 PM

దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేట్ ..


ప్రతిరోజు పెరుగుతున్న కరోనా కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే మన దేశంలో ఇప్పటివరకు కరోనా విజృంభనను అడ్డుకుంటూ రికవరీ రేటును 80 శాతం పైనే ఉంచారు డాక్టర్లు.

అయితే ఇటీవల విడుదలైన లెక్కల ప్రకారం దేశంలో కరోనా రికవరీ మరింత బాగా పెరిగినట్లు సమాచారం. మహరాష్ట్ర, ఆంధ్రప్రదేష్, కర్ణాటకా, అమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీలలో 61 శాతం రికవరీ నమోదు అయింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ 90 శాతానికి చేరిందన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ దేశంలో 78.15 లక్షల కేసులు నమోదయ్యాయి.

అందులో 70.16 లక్షల మంది రికవరీ అయినట్లు తెలిపారు. అయితే శనివారం జరిగిన 650 మరణాలతో కలుపుకుని మరణాల రేటు 1.18 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 53,370 కొత్త కేసులు నమోదయ్యయి. అదేవిధంగా 24 గంటల్లో 67,549 మంది రికవరీ అయినట్లు తెలిపారు.

Tags :
|

Advertisement