Advertisement

  • Breaking News: స్కూళ్లు, కాలేజీలు ఓపెన్...150 మంది టీచర్లకు కరోనా పాజిటివ్...!

Breaking News: స్కూళ్లు, కాలేజీలు ఓపెన్...150 మంది టీచర్లకు కరోనా పాజిటివ్...!

By: Anji Thu, 05 Nov 2020 06:37 AM

Breaking News: స్కూళ్లు, కాలేజీలు ఓపెన్...150 మంది టీచర్లకు కరోనా పాజిటివ్...!

కరోనా వైరస్ నేపధ్యంలో గత కొన్ని నెలలుగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలు.. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2వ తేదీ నుంచి తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

అయితే రాష్ట్రంలో రోజురోజుకూ కొత్త కరోనా కేసులు వెలుగులోకి వస్తుండటంతో అటు విద్యార్ధులకు, తల్లిదండ్రులకు, టీచర్లకు ప్రస్తుత పరిస్థితి సవాల్‌గా మారింది.

ఇదిలా ఉంటే చిత్తూరులో కరోనా కేసులు ఎక్కువైయ్యాయి. స్కూల్స్ తెరిచిన మూడు రోజుల్లోనే ఆ జిల్లాలో సుమారు 150 మంది టీచర్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. అంతేకాదు 9 మంది విద్యార్ధులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఈ నేపధ్యంలో ఈ నెల 8వ తేదీ లోగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయులు కోవిడ్ నిర్ధారణ ల్యాబ్స్ వద్ద క్యూ కట్టారు.

కాగా, కరోనా సోకిన టీచర్లకు 14 రోజులు సెలవులు ఇచ్చామని.. అన్ని స్కూల్స్‌ను శానిటైజేషన్ చేస్తున్నామని చిత్తూరు డీఈవో నరసింహారెడ్డి వెల్లడించారు.

Tags :

Advertisement