ప్రపంచ వ్యాప్తంగా ఆగని కరోనా ఉదృతి ..
By: Sankar Tue, 07 July 2020 11:50 AM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు ..ముఖ్యంగా అమెరికా , బ్రెజిల్ , రష్యా , ఇండియా , సౌత్ ఆఫ్రికాలలో కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది ..తాజాగా అమెరికాలో గత 24 గంటల్లో 46,603 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అగ్రరాజ్యంలో మొత్తం బాధితుల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. కరోనా కారణంగా ఇప్పటివరకు 1.32 లక్షల మంది చనిపోయారు. అమెరికా హౌస్ స్పీకర్ ఫిలిప్ గన్‌కు కూడా పాజిటివ్‌గా తేలింది. కాగా అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధికకేసులు నమోదు అవుతున దేశం బ్రెజిల్ ..బ్రెజిల్లో గత 24 గంటల్లో 33,514 కేసులు వెలుగుచూడగా, 737 మంది మృత్యువాతపడ్డారు.
ఇక రష్యాలో కొత్తగా 22,332 మందికి వైరస్ సోకింది. దక్షిణాఫ్రికాలో 8,773 మందికి వైరస్ సోకగా మొత్తం బాధితుల సంఖ్య 1,96,750కి పెరిగింది. సౌతాఫ్రికన్ హిందూ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు జయ్‌రాజ్ బచ్చుకి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ ఆఫ్రికా దేశాలు లాక్‌డౌన్‌ను సడలిస్తున్నాయి. భారత్ నుంచి వచ్చిన ఐదుగురికి పాజిటివ్‌గా తేలిందని సింగపూర్ ప్రకటించింది. ఈజిప్టు ప్రభుత్వం అక్కడి వైద్యులపై సీరియ్‌సగా ఉంది.
కొవిడ్ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకు 10 మంది వైద్యులు, ఆరుగురు జర్నలిస్టులను అరెస్టు చేసింది. ఈ దేశంలో ఇప్పటివరకు 75 వేల మందికిపైగా వైరస్ సోకింది. ఆస్ర్టేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో కేసులు పెరుగుదలతో వందేళ్ల తర్వాత తొలిసారిగా సరిహద్దులు మూసేశారు. పాకిస్థాన్‌లో కొత్తగా 3,344 కేసులు బయటపడ్డాయి. ఆరోగ్యశాఖ మంత్రి జాఫర్ మీర్జాకు పాజిటివ్ వచ్చింది. ఫిలిప్పీన్స్‌లో కొత్తగా 2 వేలకుపైనే కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 44 వేలు దాటింది.