కరోనా మూలాలు భారత్‌లోనే...
By: chandrasekar Mon, 30 Nov 2020 1:50 PM
ప్రపంచాన్ని వణికిస్తోన్న
కరోనా చైనాలోనే పుట్టిందనేది అందరికి
తెలుసు. కరోనా పుట్టుకపై యావత్ ప్రపంచం
చైనాను దోషిగా అంటున్నా ఆ దేశ శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. కరోనా
కేసులను తొలిసారి వుహాన్ నగరంలో గుర్తించినంత మాత్రాన.. ఇక్కడే పుట్టిందని
చెప్పలేమని అంటున్నారు. అంతేకాదు, కరోనా జన్యు పరివర్తనంలో స్వల్పంగా మార్పులున్న భారత్
లేదా బంగ్లాదేశ్‌లోనే కరోనా మూలాలు ఉండవచ్చని చైనా శాస్త్రవేత్తలు ఓ పరిశోధనా
పత్రంలో తెలిపారు. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌లో ‘ది
ఎర్లీ క్రిప్టిక్ ట్రాన్స్‌మిషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ సార్స్ కోవ్-2 ఇన్
హ్యూమన్ హోస్ట్స్’ పేరు పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. మొత్తం 17
దేశాల్లోని కరోనా వైరస్ జన్యుక్రమాలపై పరిశోధనల అనంతరం ఈ నివేదికను
రూపొందించినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు.
కరోనా మూలాలపై
ఫిలోజెనెటిక్ విశ్లేషణ ద్వారా పరిశోధనలు చేపట్టామని తెలిపారు. ఈ విశ్లేషణ ప్రకారం
కరోనా వైరస్ వుహాన్‌లో పుట్టలేదని భారత్, బంగ్లాదేశ్, అమెరికా, ఆస్ట్రేలియా, గ్రీస్, ఇటలీ, చెక్
రిపబ్లిక్, రష్యా, సెర్బియా దేశాల నుంచే వ్యాప్తి మొదలై ఉండవచ్చని
అభిప్రాయ౦ వ్యక్తం చేసారు. వైరస్ జన్యు మూలాలను తెలుసుకోడానికి సంప్రదాయ విధానం
తోడ్పాటును అందించలేదని పరిశోధనకు నేతృత్వం వహించిన డా.షెన్ లిబింగ్
పేర్కొన్నారు. చాలా ఏళ్ల కిందట నైరుతి చైనాలోని యునాన్‌లో గుర్తించిన గబ్బిలం
వైరస్‌ను ఇందుకోసం ఉపయోగించినట్లు తెలిపారు.ఇదిలా ఉండగా, ఈ
పరిశోధనా పత్రంలోని అంశాలపై ఆ దేశ విదేశాంగ శాఖ ఆసక్తికరంగా స్పందించింది. ఈ
ఫలితాలతో చైనా ప్రభుత్వం ఏకీభవిస్తుందా? అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ను
ప్రశ్నించగా.. కరోనా మూలాన్ని కనుగొనడం అత్యంత క్లిష్టతరమని సమాధానం చెప్పారు.
పరస్పర సహకారంతో
ప్రపంచంలోని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మరోవైపు, వైరస్
మూలాలపై చైనాలో దర్యాప్తు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం
చేసింది. గతంలో ఈ వైరస్ ఐరోపా నుంచి వచ్చిందని వాదించిన చైనా శాస్త్రవేత్తలు ప్రస్తుతం భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారు.
భారత్‌లో 2019 వేసవిలోనే జంతువుల నుంచి మానవులకు కలుషిత నీటి
ద్వారా కరోనా వచ్చిందని చైనా సైన్సెస్ అకాడమీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది
వుహాన్‌కు చేరిన విషయం గుర్తించలేకపోయారని అంటున్నారు. అయితే, చైనాకు
ఇటువంటి ఆరోపణలు చేయడం కొత్తేం కాదు. గతంలో ఇటలీ, అమెరికా, ఐరోపాలలో
మహమ్మారి పుట్టిందని నిరాధార ఆరోపణలు చేసింది. నీటి కొరత వల్ల కోతులు వంటి అడవి
జంతువులు ఘోరమైన పోరాటంలో పాల్గొనడానికి కారణమయ్యాయి.. అడవి జంతువులపై మానవుల
సంరక్షణ అవకాశం పెరుగుతుంది. భారతదేశంలో పేలవమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, యువత
ఎక్కువగా ఉండటం వల్ల వైరస్ చాలా నెలలు గుర్తించలేదు’ అని చైనా శాస్త్రవేత్తలు
పేర్కొవడం విశేషం.