తెలంగాణలో మళ్లీ కలకలం రేపుతున్న కరోనా
By: chandrasekar Tue, 08 Sept 2020 11:44 AM
తెలంగాణలో కరోనా కేసులు నిన్న తగ్గినట్లే తగ్గి మళ్లీ ఈ
రోజు కేసులు పెరిగాయి. తాాజగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,392 కరోనా
కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,45,163కి చేరింది.
ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ
మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11మంది
మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 906కి చేరింది
నిన్న తెలంగాణ వ్యాప్తంగా
60,923 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 18,27,905 నమూనాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,670 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది
మరో 24,579 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.62శాతం
ఉండగా, దేశంలో
1.69గా
ఉందని చెప్పింది. అలాగే రికవరీ రేటు 77.5శాతంగా ఉందని తెలిపింది.